Tuesday, 14 February 2017

బెల్లం వలన కలిగే లాభాలు - Benefits with jaggery



బెల్లం తినడం వలన కలిగే లాభాలు:;-
  • బెల్లంలో మన శరీరానికి కావలిసిన ఇనుము సమృద్ధిగా ఉంటుంది.
  • మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు బెల్లం నెయ్యి సమానంగా కలిపి తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
  • బెల్లం పెరుగు కలిపి తీసుకోవడం వలన ముక్కు నుండి రక్తం రావడాన్ని అరికడుతుంది.
  • ప్రతిరోజూ అన్నం తిన్న తరువాత బెల్లం ముక్క తినడం వలన తేలికగా జీర్ణం అవుతుంది.
  • బెల్లం పానకంలో తులసి ఆకులు కలిపి తీసుకోవలన పొడిదగ్గు తగ్గుతుంది.
  • కీళ్ళ నొప్పులు ఉన్నవారికి బెల్లం బాగా సహాయపడుతుంది.
  • బెల్లం పానకం తాగడం వలన వేడి చేసినవారికి శరీరం చల్లబడుతుంది.
  • రక్త హీనతతో బాధ పడేవారికి బెల్లం చాలా మంచి సహాయకారిని.

చక్కర తింటే అంతే! చక్కర వల్ల కలిగే నష్టాలు వింటే జీవితంలో చక్కర తినరు.




చక్కెరతో కలిగే నష్టాలు:-
  • చక్కెరలో ప్రోటీన్లు గాని, విటమిన్లు గాని, మినరల్సు గాని మరే ఇతర ఆవశ్యక పదార్థాలు లేవు. కేవలం శక్తి (Energy) మాత్రమె ఉంటుంది. కావున చక్కర తీసుకోవడం వలన ప్రోటీన్ల, విటమిన్ల, మినరల్స్ లోపం ఏర్పడుతుంది.
  • చక్కర ఎక్కువగా తినడం వలన కాలేయం (Liver)పై వత్తిడి పెరిగి "Fatty Liver", Non-Alcoholic fatty liver" వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
  • రక్తంలో చక్కర శాతం చాలా ప్రమాదకరం. అందుకే మన శరీరం శక్తి కోసం కొవ్వును కరిగించడానికి బదులు మొదట రక్తంలోని చక్కెరను శక్తిగా మార్చుకుంటుంది. తత్ఫలింతంగా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది.
  • చక్కర ఎక్కువగా తినడం వాళ్ళ చక్కర వ్యాధి (Sugar) వచ్చే అవకాశం ఎక్కువ.
  • చక్కర ఎక్కువ తీసుకోవడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • చక్కర తినడం వలన మన మెదడులో "Dopamine" విడుదల అవుతుంది. ఇది మనల్ని చక్కరకు వ్యసనపరున్ని చేస్తుంది.
  • చక్కర తినడం వలన ఊబకాయం వస్తుంది.
  • చక్కర తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది.

Monday, 13 February 2017

మీకు తెలుసా? Do you know? - Part 4


  • మన శరీరంలోని బ్యాక్టీరియా మొత్తం కలిపి దాదాపు 4 పౌండ్లు (1800 గ్రాములు) ఉంటుంది.

  •   ప్రతి రాత్రి 7 గంటల కంటే తక్కువ నిద్రించే వారి జీవిత సాఫల్యత తగ్గుతుంది.

  • మన శరీరంలోని ఏ భాగమైనా క్యాన్సరు వ్యాధికి  గురయ్యే అవకాశం ఉంది.  మొత్తం 100 రకాల క్యాన్సర్లు (Cancer) కలవు.

  • మన గుండె చప్పుడు మనం వినే సంగీతాన్ని అనుకరించి తన వేగాన్ని మార్చుకుంటుంది.

  • మన మెదడు శరీరంలోని  20% ఆక్సిజనిని మరియు రక్తాన్ని వినియోగించుకుంటుంది. 

  • మన ఎముకలలో 31 శాతం నీరు ఉంటుంది.

  • ప్రపంచ జనాభా కంటే మన నోటి లోని బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ.

  • ప్రతి రోజు మన గుండె పుట్టించే శక్తితో ఒక ట్రక్కును 32 కిలో మీటర్లు నడపవచ్చు.

  • మన శరీరంలోని DNA ను మొత్తం ఒక తీగలాగా చేస్తే దాని పొడవు ఒక కోటి 60 లక్షల కిలో మీటర్లు ఉంటుంది. అంటే ఒకసారి భూమి నుండి ప్లూటో వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేంత దూరం.

Friday, 3 February 2017

మీకు తెలుసా? Do you know? - part -3

  • మనిషి కంటిని డిజిటల్ కెమెరా(Digital Camera) తో పోలిస్తే 576 మెగా పిక్సెల్స్ (Mega Pixel) తో సమానం.
  • మనం మెలుకువగా ఉన్న సమయంలోని 10% కళ్ళు మూసుకొని లేదా రెప్ప వాల్చి ఉంటాము.
  • మన కళ్ళు ఒక కోటి రంగులను గుర్తించగలవు.
  • మామూలు వాళ్ళ కంటే నీలి రంగు కన్నులు గల వారికి ఆల్కహాల్ సహించే శక్తి ఎక్కువగా ఉంటుంది.


  • మనిషి నిద్రనుంచి లేవగానే ఒక చిన్న బల్బు వెలిగించడానికి కావలసినంత విద్యుత్తు ఉత్పన్నమవుతుంది.


  • చెవులు ముక్కులు ఎప్పటికి పెరుగుతూనే ఉంటాయి.


  • శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా ఉన్నవారికి మేధస్సు ఎక్కువ.


  • మన అందరి వేలి ముద్రలలాగే అందరి నాలుక గుర్తులు కూడా వేరు వేరుగా ఉంటాయి.



Thursday, 2 February 2017

మీకు తెలుసా? do you know? - Part 2


Add caption

  • మన ముక్కు 50,000 రకాల వేరు వేరు వాసనలను చూడగలదు.
  • మనిషి చర్మం ప్రతి గంటకు 6,00,000 కణాలను వదిలేస్తుంది.
  • ఒక వ్యక్తీ యొక్క శరీరం 7,000,000,000,000,000,000,000,000,000 అణువులతో తయారవుతుంది.
  • పెద్దల శరీరంలోని ఎముకల సంఖ్య కంటే  పిల్లల శరీరంలోని ఎముకల సంఖ్య 60 ఎక్కువ.
  • మానవ శరీరంలోని రక్తనాళాల పొడవు 1,00,000 మైళ్ళు (160934.4 Km).
  • ఒక వ్యక్తి యొక్క నోటిలో తన జీవితకాలంలో స్రవించే లాలాజలం 25,000 లీటర్లు అంటే దాదాపు రెండు ఈత కొలనులను నింప గలిగినంత.
  • మానవ శరీరంలోని ఇనుము మొత్తంతో 3 అంగుళాల పొడవు గల మేకును తయారుచేయవచ్చు.
  • మన కను రెప్పలపై తవిటి పురుగు (mites) అనే అతి సూక్ష్మ జీవులు ఉంటాయి.
  • మానవ శరీరంలో అతి శక్తివంతమైన కండరం - దవడ కండరం.
  • చెమటకు స్వతహాగా దుర్వాసన ఉండదు. మనిషి చర్మం పైన ఉండే సూక్ష్మజీవులు చెమటతో కూడి ఆ దుర్వాసనను కలిగిస్తాయి.
ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటె తప్పకుండా subscribe చేయండి.

Sunday, 29 January 2017

మీకు తెలుసా? Do you Know?part-1




  1. మానవ మెదడు పగటి కంటే రాత్రి వేళ చురుగ్గా పనిచేస్తుంది.
  2. మీ I.Q. (Intelligence Quotient) ప్రజ్ఞా లబ్ది ఎంత ఎక్కువగా ఉంటె మీకు అంత కలలు ఎక్కువగా వస్తాయి.
  3. మానవ శరీరంలో వేగంగా పెరిగే వెంట్రుకలు "మీసాలు" "గడ్డాలు".
  4. మనిషి చేతి మధ్య వెలి గోరు మిగతా వేలి గొర్ల కంటే వేగంగా పెరుగుతాయి.
  5. కాలి గొర్ల కంటే చేతి వేళ్ళ గోర్లు నాలుగు రెట్లు వేగంగా పెరుగుతాయి.
  6. మనిషి వెంట్రుకల సరాసరి జీవిత కాలం ౩ నుండి 7 సంవత్సరాలు.
  7. మనిషి కడుపు లోని ఆమ్లం (Acid) జింక్ లోహాన్ని కరిగించగలదు.
  8. మగవారి గుండె కన్నా ఆడవారి గుండె వేగంగా కొట్టుకొంటుంది.
  9. ఆడవారు మగవారి కంటే రెండు రెట్లు ఎక్కువగా కళ్ళు ఆర్పుతారు.
  10. ఆడవారి కంటే మగవారికి ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయి.

Wednesday, 25 January 2017

ఆదాయ పన్ను నుండి తప్పించుకోవడానికి 7 మార్గాలు


ఆదాయ పన్ను నుండి తప్పించుకోవడానికి 7 రాచమార్గాలు.


  1. Equity Linked Saving Services (ELSS)
  2. Fixed Deposits (FD)
  3. Employees Provident Fund (EPF)
  4. Public Provident Fund (PPF)
  5. Unit Linked Insurance Plan (ULIP)
  6. Sukanya Samriddhi Yojana (SSY)
  7. National Payment Scheme(NPS)

BREAKING NEWS : వారానికి 2 లక్షలు విత్ డ్రా - RBI ని కోరిన ఎలక్షన్ కమీషన్

                

      ప్రస్తుతం బ్యాంక్ నుంచి విత్ఉ డ్రా చేసుకోవడానికి ఉన్న పరిమితి వారానికి రు.24,000/- నుంచి 2 లక్షలకు పెంచాలని ఎలక్షన్ కమీషన్ ఆర్.బి.ఐ. ని కోరింది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల దృష్ట్యా పోటీలో ఉన్న అభ్యర్ధులకు ఈ అవకాశాన్ని కల్పించాలని RBI ఎలక్షన్ కమీషన్ ను అడిగింది.

Tuesday, 24 January 2017

రు.3,990/- లకే Apple I-Phone 6 + వోడాఫోన్ 4జి 9 జిబి ఉచితం!

      
 అవును మీరు చదువుతున్నది నిజమే Apple  I-Phone 6  ఇప్పుడు మీరు పొందవచ్చు కేవలం రు.3,990/- లకే. దీనితో పాటు మీరు పొందుతారు వోడాఫోన్ 4జి 9జిబి డాటా ఉచితంగా. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే flipkart వెబ్ సైట్ లో buy with exchange offer క్లిక్ చేయండి. మీ పాత ఫోన్ మోడల్ మరియు IMEI నంబరు నింపి రు.24,000/- వరకు తగ్గింపు పొందవచ్చు. మిగతా మొత్తం మీరు ఆన్లైన్ ద్వారా గాని లేదా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా కట్టవచ్చు.  దీనితో పాటు మీకు లభిస్తుంది 10% క్యాష్ బ్యాక్ ఆఫర్.

ఫోన్ ఫీచర్లు:-
  1. 1GB RAM
  2. 16GB ROM
  3. 4.7-inch Display(Retina HD)
  4. 8MP primary Camara
  5. 1.2 MP Front Camara
  6. Li-on Battery
  7. A8 chip with 64-bit architecture and M8 Motion Co-Processer.

Monday, 23 January 2017

త్వరలోనే ప్రతి సిమ్ కి E-KYC తప్పని సరి

         
   మనం సిమ్ కొనాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తాం లేదా ఏదైనా id కార్డ్ జిరాక్స్ ఇచ్చి కొత్త సిమ్ కొంటాం. దీని ద్వారా సిమ్ కార్డులను తీవ్రవాదులు చాలా సులభంగా పొందడానికి వీలువుతుంది. మీ పేరుతొ సిమ్ కార్డు ఇంకెవరో వాడుతుంటారు.అందువలన ఇకపై కొత్త సిమ్ కొనాలంటే ఖచ్చితంగా E-KYC ద్వారా మాత్రమె సిమ్ కార్డులు అమ్మాలని TRAI ప్రతిపాదించింది. పాత సిమ్ కార్డులకు కూడా మళ్ళీ E-KYC జత చేయాలని తెలిపింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాల్సి ఉంది.

త్వరలోనే రు.2000 నోటు రద్దు?


                  త్వరలోనే రు.2000 నోటు రద్దు కాబోతుందా? అంటే అవుననే వార్తలొస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం వచ్చే ఎన్నికల లోపే (2019) ఈ నోట్ల రద్దు ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పత్రికా విలేకరి పాత నోట్ల రద్దు ప్రక్రియ విజయవంతం అని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా అనిల్ బోకిల్ (నోట్ల రద్దు సలహా ఇచ్చిన వ్యక్తీ)  రు. 2000 నోటు  అనేది నోట్ల రద్దు ప్రక్రియలో తాత్కాలికంగా ఉపయోగానికి మాత్రమె. త్వరలోనే దీనిని కూడా రద్దు చేయవచ్చు అని చెప్పారు. నిరక్షరాశ్యత, పేదరికం ఉన్న భారతదేశంలో ఇది ఎంత వరకు విజయవంతం అవుతుంది అని భావిస్తున్నారు అన్న ప్రశ్నకు బదులుగా పేదలకు పెద్ద మొత్తాలతో అవసరం ఉండదు వారి కోసం 10, 2౦, 50, 100 రూపాయల నోట్లు అందుబాటులో ఉంటాయి. అవి వారి అవసరాలకు సరిపోతాయి. ఇక నిరక్షరాస్యుల విషయానికి వస్తే వారికి డిజిటల్ అక్షరాస్యత కల్పించటానికి ఒక సంవత్సరం సరిపోతుంది అని చెప్పారు.