Monday, 23 January 2017

త్వరలోనే రు.2000 నోటు రద్దు?


                  త్వరలోనే రు.2000 నోటు రద్దు కాబోతుందా? అంటే అవుననే వార్తలొస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం వచ్చే ఎన్నికల లోపే (2019) ఈ నోట్ల రద్దు ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పత్రికా విలేకరి పాత నోట్ల రద్దు ప్రక్రియ విజయవంతం అని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా అనిల్ బోకిల్ (నోట్ల రద్దు సలహా ఇచ్చిన వ్యక్తీ)  రు. 2000 నోటు  అనేది నోట్ల రద్దు ప్రక్రియలో తాత్కాలికంగా ఉపయోగానికి మాత్రమె. త్వరలోనే దీనిని కూడా రద్దు చేయవచ్చు అని చెప్పారు. నిరక్షరాశ్యత, పేదరికం ఉన్న భారతదేశంలో ఇది ఎంత వరకు విజయవంతం అవుతుంది అని భావిస్తున్నారు అన్న ప్రశ్నకు బదులుగా పేదలకు పెద్ద మొత్తాలతో అవసరం ఉండదు వారి కోసం 10, 2౦, 50, 100 రూపాయల నోట్లు అందుబాటులో ఉంటాయి. అవి వారి అవసరాలకు సరిపోతాయి. ఇక నిరక్షరాస్యుల విషయానికి వస్తే వారికి డిజిటల్ అక్షరాస్యత కల్పించటానికి ఒక సంవత్సరం సరిపోతుంది అని చెప్పారు. 

No comments:

Post a Comment