Tuesday, 14 February 2017

బెల్లం వలన కలిగే లాభాలు - Benefits with jaggery



బెల్లం తినడం వలన కలిగే లాభాలు:;-
  • బెల్లంలో మన శరీరానికి కావలిసిన ఇనుము సమృద్ధిగా ఉంటుంది.
  • మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు బెల్లం నెయ్యి సమానంగా కలిపి తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
  • బెల్లం పెరుగు కలిపి తీసుకోవడం వలన ముక్కు నుండి రక్తం రావడాన్ని అరికడుతుంది.
  • ప్రతిరోజూ అన్నం తిన్న తరువాత బెల్లం ముక్క తినడం వలన తేలికగా జీర్ణం అవుతుంది.
  • బెల్లం పానకంలో తులసి ఆకులు కలిపి తీసుకోవలన పొడిదగ్గు తగ్గుతుంది.
  • కీళ్ళ నొప్పులు ఉన్నవారికి బెల్లం బాగా సహాయపడుతుంది.
  • బెల్లం పానకం తాగడం వలన వేడి చేసినవారికి శరీరం చల్లబడుతుంది.
  • రక్త హీనతతో బాధ పడేవారికి బెల్లం చాలా మంచి సహాయకారిని.

చక్కర తింటే అంతే! చక్కర వల్ల కలిగే నష్టాలు వింటే జీవితంలో చక్కర తినరు.




చక్కెరతో కలిగే నష్టాలు:-
  • చక్కెరలో ప్రోటీన్లు గాని, విటమిన్లు గాని, మినరల్సు గాని మరే ఇతర ఆవశ్యక పదార్థాలు లేవు. కేవలం శక్తి (Energy) మాత్రమె ఉంటుంది. కావున చక్కర తీసుకోవడం వలన ప్రోటీన్ల, విటమిన్ల, మినరల్స్ లోపం ఏర్పడుతుంది.
  • చక్కర ఎక్కువగా తినడం వలన కాలేయం (Liver)పై వత్తిడి పెరిగి "Fatty Liver", Non-Alcoholic fatty liver" వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
  • రక్తంలో చక్కర శాతం చాలా ప్రమాదకరం. అందుకే మన శరీరం శక్తి కోసం కొవ్వును కరిగించడానికి బదులు మొదట రక్తంలోని చక్కెరను శక్తిగా మార్చుకుంటుంది. తత్ఫలింతంగా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది.
  • చక్కర ఎక్కువగా తినడం వాళ్ళ చక్కర వ్యాధి (Sugar) వచ్చే అవకాశం ఎక్కువ.
  • చక్కర ఎక్కువ తీసుకోవడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • చక్కర తినడం వలన మన మెదడులో "Dopamine" విడుదల అవుతుంది. ఇది మనల్ని చక్కరకు వ్యసనపరున్ని చేస్తుంది.
  • చక్కర తినడం వలన ఊబకాయం వస్తుంది.
  • చక్కర తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది.

Monday, 13 February 2017

మీకు తెలుసా? Do you know? - Part 4


  • మన శరీరంలోని బ్యాక్టీరియా మొత్తం కలిపి దాదాపు 4 పౌండ్లు (1800 గ్రాములు) ఉంటుంది.

  •   ప్రతి రాత్రి 7 గంటల కంటే తక్కువ నిద్రించే వారి జీవిత సాఫల్యత తగ్గుతుంది.

  • మన శరీరంలోని ఏ భాగమైనా క్యాన్సరు వ్యాధికి  గురయ్యే అవకాశం ఉంది.  మొత్తం 100 రకాల క్యాన్సర్లు (Cancer) కలవు.

  • మన గుండె చప్పుడు మనం వినే సంగీతాన్ని అనుకరించి తన వేగాన్ని మార్చుకుంటుంది.

  • మన మెదడు శరీరంలోని  20% ఆక్సిజనిని మరియు రక్తాన్ని వినియోగించుకుంటుంది. 

  • మన ఎముకలలో 31 శాతం నీరు ఉంటుంది.

  • ప్రపంచ జనాభా కంటే మన నోటి లోని బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ.

  • ప్రతి రోజు మన గుండె పుట్టించే శక్తితో ఒక ట్రక్కును 32 కిలో మీటర్లు నడపవచ్చు.

  • మన శరీరంలోని DNA ను మొత్తం ఒక తీగలాగా చేస్తే దాని పొడవు ఒక కోటి 60 లక్షల కిలో మీటర్లు ఉంటుంది. అంటే ఒకసారి భూమి నుండి ప్లూటో వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేంత దూరం.

Friday, 3 February 2017

మీకు తెలుసా? Do you know? - part -3

  • మనిషి కంటిని డిజిటల్ కెమెరా(Digital Camera) తో పోలిస్తే 576 మెగా పిక్సెల్స్ (Mega Pixel) తో సమానం.
  • మనం మెలుకువగా ఉన్న సమయంలోని 10% కళ్ళు మూసుకొని లేదా రెప్ప వాల్చి ఉంటాము.
  • మన కళ్ళు ఒక కోటి రంగులను గుర్తించగలవు.
  • మామూలు వాళ్ళ కంటే నీలి రంగు కన్నులు గల వారికి ఆల్కహాల్ సహించే శక్తి ఎక్కువగా ఉంటుంది.


  • మనిషి నిద్రనుంచి లేవగానే ఒక చిన్న బల్బు వెలిగించడానికి కావలసినంత విద్యుత్తు ఉత్పన్నమవుతుంది.


  • చెవులు ముక్కులు ఎప్పటికి పెరుగుతూనే ఉంటాయి.


  • శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా ఉన్నవారికి మేధస్సు ఎక్కువ.


  • మన అందరి వేలి ముద్రలలాగే అందరి నాలుక గుర్తులు కూడా వేరు వేరుగా ఉంటాయి.



Thursday, 2 February 2017

మీకు తెలుసా? do you know? - Part 2


Add caption

  • మన ముక్కు 50,000 రకాల వేరు వేరు వాసనలను చూడగలదు.
  • మనిషి చర్మం ప్రతి గంటకు 6,00,000 కణాలను వదిలేస్తుంది.
  • ఒక వ్యక్తీ యొక్క శరీరం 7,000,000,000,000,000,000,000,000,000 అణువులతో తయారవుతుంది.
  • పెద్దల శరీరంలోని ఎముకల సంఖ్య కంటే  పిల్లల శరీరంలోని ఎముకల సంఖ్య 60 ఎక్కువ.
  • మానవ శరీరంలోని రక్తనాళాల పొడవు 1,00,000 మైళ్ళు (160934.4 Km).
  • ఒక వ్యక్తి యొక్క నోటిలో తన జీవితకాలంలో స్రవించే లాలాజలం 25,000 లీటర్లు అంటే దాదాపు రెండు ఈత కొలనులను నింప గలిగినంత.
  • మానవ శరీరంలోని ఇనుము మొత్తంతో 3 అంగుళాల పొడవు గల మేకును తయారుచేయవచ్చు.
  • మన కను రెప్పలపై తవిటి పురుగు (mites) అనే అతి సూక్ష్మ జీవులు ఉంటాయి.
  • మానవ శరీరంలో అతి శక్తివంతమైన కండరం - దవడ కండరం.
  • చెమటకు స్వతహాగా దుర్వాసన ఉండదు. మనిషి చర్మం పైన ఉండే సూక్ష్మజీవులు చెమటతో కూడి ఆ దుర్వాసనను కలిగిస్తాయి.
ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటె తప్పకుండా subscribe చేయండి.