Saturday, 4 August 2018

రంగులు చెప్పే రహస్యం - మైలురాళ్ళకు ఉండే రంగుల అర్థం


రంగులు చెప్పే రహస్యం



మనం ఎక్కడికైనా ఊరెల్లేటప్పుడు రోడ్డు ప్రక్కన మైలురాళ్ళు చూస్తుంటాము. మనం వెళ్ళవలసిన ఊరు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందొ అందులో వ్రాసి ఉండటం మనందరికీ తెలుసు. కానీ ఆ రాయికి పై భాగాన రంగు పూసి ఉంటుంది. ఆ రంగులు ఒక్కోచోట ఒక్కో రంగు వేసి ఉండటం గమనిస్తుంటాం. ఎందుకు ఆ రంగులు అలా వేశారు? ఆ రంగులు అలా వేయడం వెనక ఏమైనా అర్థం ఉందా? ఆ రంగులు మనకేమైనా చెబుతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ఆ రంగులకు ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంది.


మొదటగా  పసుపు (Yellow) రంగును చూస్తే ఇది మనకు జాతీయ రహదారి (National Highway)ని సూచిస్తుంది. అంటే ఈ రంగు మైలురాళ్ళు మనకు కనిపించినపుడు మనం జాతీయ రహదారిలో వెళుతున్నామని అర్థం.






 ఆకుపచ్చ (Green) రంగు ఉంటే ఇది మనకు రాష్ట్రీయ రహదారి (State Highway)ని సూచిస్తుంది. అంటే ఈ రంగు మైలురాళ్ళు మనకు కనిపించినపుడు మనం రాష్ట్రీయ రహదారిలో వెళుతున్నామని అర్థం.







నలుపు (Black) రంగు మైలురాళ్ళు ఉంటే ఇది మనకు జిల్లాకు లేదా పట్టణాని (District / City Road)కి  చెందిన దారిని సూచిస్తుంది. 







 ఇక చివరగా ఎరుపు రంగు (Red). ఈ రంగు మైలురాళ్ళు ఉంటే ఇది మనకు పల్లెకు (Rural)కి  చెందిన దారిని సూచిస్తుంది.

Tuesday, 14 February 2017

బెల్లం వలన కలిగే లాభాలు - Benefits with jaggery



బెల్లం తినడం వలన కలిగే లాభాలు:;-
  • బెల్లంలో మన శరీరానికి కావలిసిన ఇనుము సమృద్ధిగా ఉంటుంది.
  • మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు బెల్లం నెయ్యి సమానంగా కలిపి తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
  • బెల్లం పెరుగు కలిపి తీసుకోవడం వలన ముక్కు నుండి రక్తం రావడాన్ని అరికడుతుంది.
  • ప్రతిరోజూ అన్నం తిన్న తరువాత బెల్లం ముక్క తినడం వలన తేలికగా జీర్ణం అవుతుంది.
  • బెల్లం పానకంలో తులసి ఆకులు కలిపి తీసుకోవలన పొడిదగ్గు తగ్గుతుంది.
  • కీళ్ళ నొప్పులు ఉన్నవారికి బెల్లం బాగా సహాయపడుతుంది.
  • బెల్లం పానకం తాగడం వలన వేడి చేసినవారికి శరీరం చల్లబడుతుంది.
  • రక్త హీనతతో బాధ పడేవారికి బెల్లం చాలా మంచి సహాయకారిని.